India U19: సెమీస్‌లో లంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం.. 15 d ago
అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక 46.2 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో చేతన్‌శర్మ 3 వికెట్లతో రాణించగా, కిరణ్ చోర్మలే, ఆయుశ్ మాత్రె 2 వికెట్లతో లంకను నిలువరించారు. భారత్ తరుపున వైభవ్ సూర్యవంశీ 67(36), ఆయుష్ మాత్రే 34 (28) పరుగులు చేసి అలరించగా 21.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 175 పరుగులతో విజయాన్ని నమోదు చేసారు.